రాజకీయ లబ్ధి కోసమే విజయమ్మ సిరిసిల్ల పర్యటన

వేములవాడ, జూలై 22 (జనంసాక్షి) : చేనేత కార్మికుల సమస్యలంటూ  సోమవారం సిరిసిల్లలో  వైఎస్సాఆర్‌ సీపీ అధ్యక్షురాలు  విజయ మ్మ తలపెట్టిన దీక్ష కేవలం ఆ పార్టీ రాజకీయ మనుగడ కోసమేనని జేఏసీ నాయకులు ఆరోపిం చారు. వేములవాడలో ఆదివారం నాడు జేఏసీ నాయకులు బొజ్జ కనకయ్య మాట్లాడుతూ, ప్ర శాంతంగా ఉన్న సిరిసిల్ల ప్రాంతంలో అల్లర్లు సృష్టించడానికే విజయమ్మ చేనేత కార్మికుల సమ స్యల పేరుతో దీక్ష చేపట్టిందని ఆరోపించారు.

అలాగే చేనేత కార్మికుల సమస్యలపై దీక్ష పేరిట వచ్చే విజయమ్మ, సీమాంధ్రకు చెందిన తన ఎమ్మెల్యేలు, మందీ మార్బలంతో సిరిసిల్లా పర్యట నకు రావడం ఆ పార్టీ తెలంగాణాపై దండ యాత్ర చేస్తున్నట్లుగా ఉందని విమర్శించారు.  తెలంగాణాకు వ్యతిరేకంగా తన కుమారుడు జగన్‌ పార్లమెంటులో ప్లకార్డును ప్రదర్శించినపు డు గానీ, అలాగే తన భర్త, దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణాకు వస్తే పాస్‌పోర్టుతో రావాలా అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలు కానీ విజయమ్మకు గుర్తు రావడం లేదా అని ప్రశ్నిం చారు. అలాగే తన పాదయాత్ర సమయంలో 6 నెలల్లో నర్మాల ప్రాజెక్టుకు ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలవల ద్వారా త్రాగు, సాగునీటిని తరలించి అక్కడి నుంచి సిరిసిల్లా ప్రాంతానికి  పంపిస్తామని నర్మాల బహిరంగ సభలో వైఎస్‌ఆర్‌ చేసిన వాగ్దానం ఉత్త హామీలుగానే మిగిలిపోయాయని విమర్శించారు.