రాజన్నను దర్శించుకున్న ప్రముఖులు

వేములవాడ, జూన్‌ 16, (జనంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజ ేశ్వరస్వామి వారి సన్నిధికి విచ్చేసిన టిడిపి చొప్పదండి ఎంఎల్‌ఏ సుద్దాల దేవయ్య కుటుంబ సభ్యులు, బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి. రాజేందర్‌ దంపతులు శనివారం రోజున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత రెండు రోజుల క్రితం దేవయ్య కుమారునికి జరిగిన వివాహాన్ని పురస్కరించుకుని రాజన్న ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను, అలాగే బి. రాజేందర్‌ దంపతులకు ఆలయ అధికారులు అర్చకులు సాంప్రదాయ పద్దతులలో ఆహ్వానించి, గర్భగుడిలో పూజలు నిర్వహించిన అనంతరం అద్దాల మంటపంలో ఆశీర్వచనం చేసి, స్వామి వారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని సమర్పించారు.