రాజవొమ్మంగిలో రోవ్ వే.. కూలి పలువురికి తీవ్రగాయాలు
రాజవొమ్మంగి : తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కిండ్ర వద్ద మడేరు వాగుపై రోవ్‌వే కూలి 50 అడుగుల కింద ఉన్న కాలువలోకి పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది ఉపాధిహామీ కూలీలకు గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను రాజవొమ్మంగి ఆసుపత్రికి తరలించారు. రోవ్‌వేపై సామర్ధ్యానికి మించి కూలీలు ఎక్కడంతోనే ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు చెబుతున్నారు.