రాజీనామాకు సిద్ధమైన నంద్యాల ఎస్పీవై రెడ్డి

న్యూఢిల్లీ: కృష్ణా జలాల్లో శ్రీశైలం నుంచి కర్నూలు, కడప జిల్లాలకు రావాల్సిన తాగునీరు రాకపోవడంపై ఆందోళనకు దిగిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి రాజీనామాకు సిద్ధపడ్డారు. పోతిరెడ్డిపాడు వద్ద  845 అడుగుల నీటి మట్టం ఉండేలా ముఖ్యమంత్రిని కోరానా పట్టించుకోలేదన్న ఇవేదనతో లోక్‌సభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేసేందుకు సన్నద్ధం అయ్యారు. తనతోపాటు జిల్లాకు చెందని మరికొందరు నేతలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఢిల్లీలో తెలియజేశారు.