రాజీనామా చేసిన కేశూభాయి పటేల్‌

గాంధీనగర్‌: గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి కేశూబాయి పటేల్‌ బారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలో కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు ప్రకటించారు. తనతో పాటు పార్టీకి రాజీనామా చేసిన మాజీ కేంద్ర మంత్రి కాన్షీరాం రాణతో కలిసి పటేల్‌ మీడియాతో మాట్లాడారు. తామిద్దరం పార్టీకి ఎంతో సేవ చేసినప్పటికీ గుర్తించలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత పాలనపై మధ్య తరగతి, పేద ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.