రాజేశ్‌ఖన్నా చితాభస్మం గంగలో

రిషికేష్‌: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేశ్‌ఖన్నా చితాభస్మాన్ని బుధవారం పవిత్ర గంగానదిలో కలిపారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో ఈ కార్యక్రమం జరిగింది. రాజేశ్‌ఖన్నా భార్య డింపుల్‌ కపాడియా, కుమార్తె రింకీలు ముంబాయి నుంచి తీసుకొచ్చిన చితాభస్మాన్ని శాస్త్రోక్తంగా గంగాలో కలిపారు. కార్యక్రామిన్న వీక్షించేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చారు.