రాజ్యసభ సభ్యుడిగా సచిన్‌ ప్రమాణం క్రికెటే కాదు అన్ని క్రీడలకూ ప్రాధాన్యత : సచిన్‌

రాజ్యసభ సభ్యుడిగా సచిన్‌ ప్రమాణం

రాజ్యసభ సభ్యుడిగా సచిన్‌ ప్రమాణం

సచిన్‌ ప్రమాణం

   క్రికెటే కాదు అన్ని క్రీడలకూ ప్రాధాన్యత : సచిన్‌
    న్యూఢిల్లీ :

ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఇక నుంచి రాజ్యసభ సభ్యుడు కూడా. ఆయన సోమవారంనాడు రాజ్యసభ లో ప్రమాణస్వీకారం చేశారు.  ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీ ఛాంబర్‌ లో హిందిలో సచిన్‌ ప్రమాణ స్వీకారం చేశారు.  పార్లమెంట్‌ వ్యవహార శాఖామాత్యులు, ఐపిఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లాతో పాటు కొంతమంది కేంద్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు.  ప్రమాణ స్వీకారం అనంతరం  సచిన్‌ మాట్లాడుతూ క్రికెట్‌తో పాటు భారత్‌లోని అన్ని క్రీడలకు తన ప్రోత్సాహం ఉంటుందని ప్రకటించారు. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూనే క్రికెట్‌ ఆడతానని స్పష్టం చేశారు. క్రికెట్‌ నుంచి రిటైర్‌ మిగతా 2లో..అవ్వాలనే యోచన ఇప్పట్లో లేదని సచిన్‌ తెలిపారు.   క్రికెట్‌ కెప్టెన్‌ ధోని, ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే సచిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.  ప్రపంచ చెస్‌ విజేత ఆనందం సచిన్‌కు అభినందనలు తెలిపారు.ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సిఫారసుతో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ ఏప్రిల్‌ 26న సచిన్‌ను రాజ్యసభ సభ్యునిగా నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే.  సచిన్‌తో పాటు సినీనటి రేఖ, పారిశ్రామికవేత్త అను ఆగా రాజ్యసభకు నామినేట్‌ అయిన వారి లో ఉన్న విషయం విదితమే.