రాజ్‌భవన్‌ను గాంధీభవన్‌గా మార్చేశారు: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: రాజ్‌భవన్‌ను గవర్నర్‌ గాంధీభవన్‌గా మార్చేశారని, మంత్రివర్గ నిర్ణయంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే గవర్నరు సమయం కేటాయించడం లేదని తెదేపా నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ఆయన మాట్లాడుతూ జగన్‌ను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, అవినీతిపరులను కాపాడేందుకే ధర్మాన విషయంలో మంత్రివర్గ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ బద్ధ అధికారాలతో ధర్మానపై గవర్నర్‌ చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ వ్యక్తం చేశారు.