రాజ్‌ థాకరేపై కేంద్రం కఠిన చర్యలు తీసుకొవాలి

పాట్నా.: బీహరీలను చొరబాటుదారులుగా అభివర్ణించడంతో పాటు వారిని మహారాష్ట్ర నుంచి తరిమికొడతామంటూ ఎంఎన్‌ఎన్‌ అదినేత రాజ్‌థాకరే చేసిన వ్యాఖ్యలపై పలు పార్టీలు మండిపడ్డాయి. ప్రజలను విభజించేలా మాట్లాడిన థాకరేపై కఠినచర్యలు తీసుకొవాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశాయి. గతనెలలో అమర్‌జమాన్‌ జ్యోతిని అపవిత్రం చేశాడన్న అభియోగంపై అరెస్టయిన బీహార్‌ వాసి అబ్దుల్‌ ఖాదిర్‌పై విచారణలో ఆ రాష్ట్రం అడ్డంకులు సృష్టిస్తే బీహరీలను మహారాష్ట్ర నుంచి తరిమి కొడతారని రాజ్‌ శుక్రవారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. సాక్షాత్తు ధాకరే కుటుంబమే బీహార్‌కు చెందినదని, తర్వాత మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో స్థిరపడిందని చెప్పారు. అనంతరం ముంబయికి వలస వెళ్లారన్నారు. ముంబయి అంటేనే మత్స్యకారుల నగరమని మిగిలిన వారంతా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడినవారేనని చెప్పారు. రాజ్‌ వ్యాఖ్యలను ఖండించిన భాజపా నేత, బీహార్‌ మంత్రి చేశారు.