రాజస్థాన్‌లో విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ
హైదరాబాద్ జనంసాక్షి: రాజస్థాన్‌లో స్వైన్‌ఫ్లూ మరింత విజృంభిస్తోంది. ఈ వ్యాధి బారిన పడి మరో 12 మంది మృతి చెందారు. గడిచిన 48 గంటల్లో రాజస్థాన్ రాష్ట్రంలో 12 మంది స్వైన్‌ఫ్లూ తో మృతి చెందినట్లు అక్కడి అధికారులు పేర్కోన్నారు. దీంతో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 104 మంది స్వైన్‌ఫ్లూ తో మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖాధికారులు పేర్కోన్నారు.