రాయలసీమ ప్రస్తావన లేకపోతే పార్టీని వీడిచిపెడత: బైరెడ్డి

హైదరాబాద్‌: చంద్రబాబు తెలంగాణపై కేంద్రానికి ఇచ్చే లేఖలో రాయలసీమ ప్రస్తావన లేకపోతే పార్టీని వీడతానని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. రెండు రోజుల్లో ప్రత్యేక రాయలసీమ ఐకాస కార్యవర్గం ప్రకటిస్తామన్న ఆయన ఈ కార్యవర్గంలో రాజకీయ పార్టీకు చోటు లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక రాయలసీమకు మద్దతు తెలిపే వారందరికీ ఆహ్వానం పలుకుతున్నామన్నారు.