రాళ్లు విసిరిన నిరసనకారులు : బాష్పవాయు ప్రయోగం

హైదరాబాద్‌: మక్కామసీదు, చార్మినార్‌ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం సందర్భంగా మక్కామసీదులో ప్రార్ధనలు ముగిసిన అనంతరం అక్బరుద్దీన్‌కు మద్దతుగా చార్మినార్‌ వరకు ర్యాలీ చేపట్టారు. పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో మక్కా మసీదు ప్రాంగణంనుంచి నిరసనకారులు రాళ్లు విసిరారు. అల్లరిమూకలను చెదరగ్టొడానికి పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తున్నారు.