రాష్ట్రంలో అభివృద్ధి ఆగలేదు

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు చేస్తున్న పోరాటం వల్ల త్వరలోనే ఓ మంచి ఫలితం రానుందని రాష్ట్ర మంత్రి డి. శ్రీధర్‌బాబు చెప్పారు. కొందరు తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తున్నారని అయినా తమ పోరాటం వల్లనే తెలంగాణ ఏర్పడుతుందని ఆయన చెప్పారు. 2009 నుంచి రాష్ట్రంలో అభివృద్ధి జరగడంలేదని ప్రభుత్వంపై కక్షతో ఓపత్రిక రాస్తోందని రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి ఆగలేదని మంత్రి అన్నారు. రాష్ట్రంలో 2లక్షల మంది పేద విద్యార్థులకు దుస్తువులు పంపిణిచేస్తున్నామని, 27 లక్షల మంది పేద  విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇస్తున్నట్లు శ్రీధర్‌బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసరి మండలం యామ్నంపేటలో  సుమారు రూ.17కోట్ల వ్యయంతో నిర్మించిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని శ్రీధర్‌బాబుతో పాటు మరో మంత్రి ప్రసాద్‌కుమార్‌, స్థానిక శాసనసభ్యుడు .