రాష్ట్రంలో బిందుసేద్యం అమలుకు రూ.700ల కోట్లు

ప్యాపిలి: ఈ ఏడాది రాష్ట్రంలో 1.20లక్షల హెక్టార్లలో బిందు సేద్యం అమలుకు రూ.7వందల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు ఏపీఎంఐపీ ప్రాజెక్టు ఆఫీసర్‌ అశోక్‌ కుమార్‌ తెలిపారు. ఇందులో 90వేల హెక్టార్లలో బిందు సేద్యానికి కేటాయించగా, 30వేల హెక్టార్లలో సెమి పర్మనెంట్‌ స్ప్రింక్లర్లకు కేటాయించామన్నారు. సెమి పర్మనెంట్‌ పరికరాలకు ఒక్కో యూనిట్‌కు రెండున్నర హెక్టార్లకు 28, 130రూపాయల ఖర్చవుతుందని ఒక్కో రైతుకు రెండు హెక్టార్ల వరకూ అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు వందశాతం చిన్నకారు రైతులకు 90శాతం, మధ్య కారు రైతులకు 75శాతం, పదెకరాలు పై బడ్డ రైతుకు 60శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. ఈ ఏడాది కొత్త విధానాన్ని అమలుచేస్తున్నామన్నారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల పర్యటన అనంతరం ఆయన మంగళవారం కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలో పర్యటించారు.