రాష్ట్రంలో విత్తనాల కొరత లేదు

హైదరాబాద్‌:  రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి కన్నా  లక్ష్మీనారాయణ  చెప్పారు. మహికో కంపెనీకి చెందిన బీటీ విత్తనాలు తప్ప మిగతా 52 కంపెనీలకు చెందిన 100 రకాలు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు. విత్తనాల లభ్యతపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన  చెప్పారు.