రాష్ట్రంలో శాంతిభద్రతలు భేష్‌

డీజీపీ దినేశ్‌రెడ్డి
హైదరాబాద్‌, జూన్‌ 23 (జనంసాక్షి): గతేడాది కంటే రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి తెలిపారు. డీజీపీ కార్యాలయంలో శనివారంనాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలి అర్ధ సంవత్సర నేర వివరాలను వివరించారు. దినేష్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయన్నారు. నేరాల సంఖ్య తగ్గిందన్నారు. కస్టడీ కేసులను అరికట్టామన్నారు. అవినీతి అధికారులను కట్టడి చేశామన్నారు. తమ శాఖలో తొలిసారిగా ఒక డిఎస్‌పిని ఉద్యోగం నుంచి తొలగించిన విషయం తెలిసిందేనన్నారు. పోలీసులపై ప్రజలకు సదాభిప్రాయం ఏర్పడిందన్నారు. ఎవరైనా.. ఏ విషయంపైనైనా ఫిర్యాదు చేసేందుకు నేరుగా డిజిపి కార్యాలయానికి రావచ్చొని చెప్పారు. నిర్భయంగా వచ్చి ఫిర్యాదు చేసి తగిన రశీదు పొందవచ్చన్నారు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించేం దుకు పోలీసులు రంగంలోకి దిగుతారన్నారు. జంట నగరాల్లో డ్రగ్స్‌ రవాణాను అరికట్టామని చెప్పారు. సుమారుగా 18మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నామని, డ్రగ్స్‌ రాకెట్ల ఆటలను కట్టించామని చెప్పారు.