రాష్ట్రం విడిపోయే పరిస్థితి లేదు: రాయపాటి సాంబశివరావు
గుంటూరు: చంద్రబాబు పాదయాత్ర మంచిదేనని, ఏదో విధంగా అధికారంలోకి రావడానికి అభూతకల్పనను సృష్టించే ప్రయత్నంచేస్తున్నారని ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. తాము చెప్తున్నది తెలంగాణపై సీమాంధ్ర ప్రజల మనోభావాలే తప్ప వ్యక్తిగత అభిప్రాయాలు కాదని రాయపాటి అన్నారు. రాష్ట్రం విడిపోయే పరిస్థితి లేదని రాయపాటి మరోసారి స్పష్టం చేశారు.