రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్న : గవర్నర్‌

హైదరాబాద్‌ : దేశ,రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని తాను జడన్నాధుని వేడుకున్నాని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. నగరంలోని బంజారాహిల్‌లో జగన్నాధస్వామి ఆలయంలో గవర్నర్‌ దంపతులు రధయాత్ర ప్రారంభించారు. సుభధ్రదేవి, బలభద్రుడు, జగన్నాధస్వామి విగ్రహాలను అందంగా అలంకరించి రధాలపై వూరేగించారు.అంతకు ముందు విగ్రహాలను రధాల పైకి చేర్చే పహండి కార్యక్రమం ఘనంగా జరిగింది. రధోత్సవాన్ని తిలకించడానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ డాజీపీ ఏకే మహంతి సైతం ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.