రాష్ట్రపతి ఎన్నికలో ప్రణబ్‌కు ఓటేస్తే తెలంగాణకు ద్రోహమే :నాగం జనార్ధాన్‌ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణకు వ్యతిరేకి అయిన ప్రణబ్‌కు ఓటేస్తే తెలంగాణకు ద్రోహం చేసినట్లే అని నాగం జనార్ధాన్‌ రెడ్డి అన్నారు. అందుకే దళితుడైన సంగ్మాకు ఓటేసి తమ మద్దతు తెలిపామని నాగం జనార్ధాన్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు కూడా ప్రణబ్‌కు ఓటు వేయకుండా ఉండాల్సిందని ఆయన అన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన ప్రణబ్‌కు ఓటేసారని రేపు తెలంగాణ ప్రకటించకపోతే పార్టీకి పదవులకి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.