రాష్ట్రవ్యాప్తంగా ఆటో ఛార్జీలు పెంపు

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఆటో ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ఆటో ఛార్జీలు ఈ అర్ధ్రరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయని ప్రభుత్వం పేర్కొంది. 1.6 కిలో మీటర్ల వరకు కనీస రుసుం రూ. 16 ఆపై ప్రతి కలో మీటర్‌కు రూ. 9 గా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.