రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖ తనిఖీలు

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు బస్సులు, పాఠశాలల వాహనాలపై రవాణా శాఖ మూడోరోజూ తనిఖీలు చేపట్టింది. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు వేకువజామునుంచే జాతీయ రహదారులు, చెక్‌పోస్టుల వద్ద తనీఖీలు నిర్వహిస్నున్నారు. ఇప్పటివరుకు నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 39 ప్రైవేటు బస్సులు, 40 పాఠశాలల బస్సులను అధికారులు స్వాధినం చేసుకున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, మెదక్‌, అదిలాబాద్‌ జిల్లాల్లో విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి.  తూర్పుగోదావరి జిల్లాలో రిజష్ట్రేషన్‌ చేసుకోకుండానే విద్యార్థులను చేరవేస్తున్న 4 పాఠశాలల బస్సులను గుర్తించినట్లు అధికారులు తెలియజేశారు.