రాష్ట్రాంలో ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్ల విధానాన్ని వికేంద్రీకరిస్తాం: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ ఏడాది తొలిసారిగా ధాన్యం కొనుగోళ్ల విధనాన్ని వికేంద్రీకరించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఈరోజు వరిసాగు అధికంగా ఉన్న 15 జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు, డీఎన్‌ఓలు, ఎఫ్‌సీఐ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది కొత్తగా అమలుచేయనున్న ధాన్యం కొనుగోలు వికేంద్రీకరణ విధానం అమలు సాధ్యాసాధ్యాలపై ఆయన అధికారులతో చర్చించారు. ఈసారి సీజన్‌లో ప్రభుత్వం నేరుగా ధాన్యం కొనుగోలు చేయటంతోపాటు మహిళాసంఘాలు, సహకారసంఘాల ద్వారా మొత్తం 30 కిలోల టన్నుల ధాన్యం సేకరించనున్నట్లు ఆయన తెలిపారు.