రాష్ట్ర ప్రభుత్వంపై ‘ఎంయుఎసి’ ఆగ్రహం

హైదరాబాద్‌ నవంబర్‌ 14, (జనంసాక్షి) :

మజ్లిస్‌ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన షాక్‌ నుంచి తేరుకోకముందే మరో కుదుపు సంభవిస్తోంది. రాష్రంలో సాంఘిక-ధార్మిక సంస్థల ఛత్రసంస్థ, ముస్లింయునైటెడ్‌ యాక్షన్‌ కమిటీ బుధవారం హైదరాబాద్‌ లో సమచారం జరుగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భవిష్యత్‌ కార్యచరణ గురించి చర్చిస్తోంది. ఈ ఛత్ర సంస్థలో మజ్లిస్‌-ఇ-మిలాత్‌,జమైతుల్‌ మషాయిక్‌,జమైయత్‌ అహ్లే-హదిత్‌, మజ్లిస్‌-ఇ-దక్కన్‌ లాంటి సంస్థలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. అబ్దుల్‌ రహీమ్‌ కురేషీ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. అఖిలభారత ముస్లిం పెర్సనల్‌ బోర్డులో ఆయన సభ్యుడు. కిరణ్‌ కూమర్‌ రెడ్డి పక్షపాత వైఖరి గురించి తరచు సంభవిస్తున్న మత కల్లోలాల గురించి, చార్‌మినార్‌ సమిపంలో అక్రమంగా విస్తరిస్తున్న ఆలయం గురించి తాము చర్చిస్తామని చెప్పారు. సంఘపరివార్‌ పట్ల ప్రభుత్వం పక్షపాతం కలిగి ఉందని మతతత్వశక్తుల పట్ల ఉదరంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ కూడా ఈ సమవేశనికి హజరవుతున్నారు.