రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలి

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి రిజర్వ్‌ చేసిన రెండు వేల పంచాయతీ కార్యదర్శుల పోస్టులను తాత్కాలిక ఉద్యోగులతో భర్తీ చేయకుండా ఆలస్యం చేస్తున్నదుకు నిరసనగా కార్యక్రమాలు చేట్టనున్నట్లు ఏపీ పంచాయతీ రాజ్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రకటించింది. 1354 మంది పార్ట్‌టైం జూనియర్‌ అసిస్టెంట్లు, బిల్లుకలెక్టర్లు, కారొబాద్‌లను పంచాయతీ కార్యదర్శులుగా నియమంచనందుకు నిరసనగా అక్టోబర్‌ మూడో తేదీన జరిగే గ్రామసభలను బహిష్కరించాలని సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు.