రాష్ట్ర సామాజిక భద్రతా బోర్డు ఏర్పాటు

హైదరాబాద్‌: అసంఘటిత కార్మికులకు సామాజిక భధ్రతా పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర సామాజిక భద్రతా బోర్డు ఏర్పాటుచేసింది. బోర్డు చైర్మన్‌గా కార్మికశాఖమంత్రి, సభ్యకార్యదర్శిగా కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి ఉంటారు. బీసి సంక్షేమం, సాంఘిక, మేనార్టీ, మత్స్య, ఎక్సైజ్‌, అటవీ, పర్యావరణ, పురపాలక, స్త్రీశిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శులు ఇందులో సభ్యులుగా ఉంటారు. అసంఘటిత కార్మికుల తరుపు ప్రతినిదులుగా ఆరు విబాగాలకు చేందిన వారితో పాటు ఇద్దరు ఎమ్మేల్యేలు ఈ బోర్డులో సభ్యులుగా ఉంటారు.