రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా బ్యాడ్మింటన్‌ జట్ల ఎంపిక

శ్రీకాకుళం, జూన్‌ 12 : రాష్ట్ర స్థాయి జూనియర్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టును బాల్‌ బ్యాడ్మింటన్‌ సంఘం జిల్లా కార్యదర్శి వై.సత్యనారాయణ ప్రకటించారు. రాష్ట్రస్థాయి పోటీలు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు నెల్లూరులో జరగనున్నాయి. ఈ పోటీలకు గాను జిల్లా జట్టు సభ్యులుగా కె.బాలమురళికృష్ణ (ఏచ్చర్ల), పి.సునీల్‌కుమార్‌ (ఇచ్చపురం), జి.గణేష్‌, ఎల్‌. శ్రీకాంత్‌, శేఖర్‌, శ్రీనివాసవర్మ (రాజాం), ఆర్‌. లింగరాజు, ఎస్‌.సునీల్‌కుమార్‌ (గొల్లమాకలపల్లి), బి.వెంకటమరణ (పెద్దమడి), వై.శశీధర్‌,  స్టాండ్‌ బైస్‌గా ఎ.ఉమామహేశ్వరరావు (ఎచర్చ), కిరణ్‌కుమార్‌ (రాజాం)లు ఎంపిక అయినట్లు తెలిపారు. ఎంపిక క్రీడాకారులు  రాష్ట్ర స్థాయిలో పాల్గొనేందుకు ఈ నెల 15న ఉదయం 8 గంటలకు ఆముదాలవలస (శ్రీకాకుళం రోడ్డు) రైల్వే స్టేషన్‌ వద్దకు రావాలని తెలిపారు.