రాస్తారోకో నిర్వహిస్తున్న భగత్వీడు వాసులు.
కూసుమంచి సెప్టెంబర్ 29 (జనం సాక్షి): మండలంలోని భగత్వీడు తాండాలో గత సంవత్సర కాలం పాటు బాణామతితో గ్రామ వాసులను భయపెడుతున్న సంఘటనలను పోలీసుల దృష్టికి తీసుకు వచ్చినప్పటికీ అలాంటి చర్యలు చేసే వారిని గుర్తించకపోగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు గురువారం రోజున మండల కేంద్రంలోని రాష్ట్రీయ రహదారిపై బైఠాయించి వాహనాలను నిలుపుదల చేశారు ఆందోళనకారులను నచ్చజెప్పడానికి వచ్చిన పోలీసు వారిపై వాగ్వివాదం చేశారు తమకు న్యాయం చేయాలని పోలీసువారికి గత ఎనిమిది సార్లుగా విన్నవించుకున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆందోళన చేయాల్సి వచ్చిందని గ్రామస్తులు తెలిపారు ఇప్పటికైనా పోలీస్ వారు చట్టపరమైన తగు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.