రాహుల్ గాంధీకి మద్దతుగా కోటగిరిలో కాంగ్రెస్ పార్టీ మౌన దీక్ష
కోటగిరి మార్చి 24 జనం సాక్షి:-ప్రశ్నించే గొంతు కైనాఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని జైలుకు పంపాలని బిజెపి చూస్తున్న వైఖరికి నిరసనగా గురువారం ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలోనీ రచ్చగల్లి వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు మౌన దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. బ్యాంకులను దోచుకుం టున్న వారిపై ప్రశ్నించే గొంతుకు లాగా రాహుల్ గాంధీ మాట్లాడితే వారిపై అక్రమ కేసులు పెడతామనడం సిగ్గుచేటు.కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర సంస్థలను వాడుకుంటూ ప్రతిపక్ష నేతలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన ప్రజా పోరాట యాత్రను జీర్ణించుకోలేక అనవసరపు కేసులు వేసి,కక్ష సాధింపు చేపట్టడం మంచిది కాదన్నారు.రానున్న రోజుల్లో బిజెపి పార్టీకి ప్రజలు తగిన విధంగా గుణపాఠం చెబుతారని అన్నారు.ఈ మౌన దీక్షలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య క్షులు గంగాధర్ దేశాయ్,డిసిసి డెలివరీ సభ్యులు కొట్టం మనోహర్,హనుమంతు,మాజీ జెడ్పిటిసి పుప్పాల శంకర్,ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ హుస్సేన్,ఫత్తా,హైమద్,సీనియర్ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
Related