రూ.లక్ష విలువ గల టేకు కలప స్వాధీనం

ఇచ్చోడ: ఇచ్చోడలోని గెరిజం గ్రామం నుంచి అక్రమ కలపను తరలిస్తున్న ఐచర్‌ వ్యానును అటవీ శాఖాదికారులు పట్టుకున్నారు. వ్యానులో గల రూ.లక్ష విలువ గల టేకు దుంగలను స్వాధీనపరచుకొని ఇచ్చోడ కలప డిపోకు తరలించారు. ఈ దాడిలో ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు, ఎస్‌ఎస్‌ఓ పద్మావతి, జంగువావు, సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.