రెండవ రోజుకు చేరిన వైద్య విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌: తమకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు చేపట్టిన ఆందోళన రెండవ రోజుకు చేరింది. వసతిగృహ భవన నిర్మాణం, మెస్‌ భవన మరమ్మతులు చేపట్టాలని నిన్నటినుంచి వారు కోఠీలోని కాలేజీలో ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు.