రెండు ట్రాక్టర్‌లు ఢీ, ఒకరు మృతి

నల్గొండ, (మార్చి 28) :  నల్గొండ జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలో జరిగిన  ఘోర రోడ్డు ప్రమాదంలో  ఒకరు మృతి చెందారు. తుంగతుర్తి మండలం పసునూరు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ట్రాక్టర్‌లు ఢీ కొన్నాయి. ఆ ప్రమాదంలో  ఒకరు అక్కడిక్కడే  మృతి చెందాడు. దీంతో పసునూరు గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.