రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ పైచేయి

బెంగళూరు: బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ పైచేయి సాధించింది. మూడో రోజు ఆట ముగిసే సమాయానికి న్యూజిలాండ్‌ రెండో ఇన్నిగ్స్‌లో తొమ్మిది వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. ఆటముగిసే సరికి భారత్‌పై న్యూజిలాండ్‌ 244 పరుగుల ఆధిక్యంలో ఉంది. 283 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ మరో 70 పరుగులు జోడించి లౌటయ్యింది. అనంతరం న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. న్యూజిలాండ్‌ నుంచి ఫ్రాంక్లిన్‌ 41, టేలర్‌ 35 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్‌ 5, ఓజా, ఉమేష్‌ వాదవ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.