రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

మొదటి రౌండ్‌లో లీడ్‌లో పల్లా
నల్లగొండ,మార్చి26   (జ‌నంసాక్షి) :  ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది.  ఈ కౌంటింగ్‌ లో ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో విజేతగా నిలవాలంటే  ఏ పార్టీకైనా 66,777 ఓట్లు రావాలి. కానీ టీఆర్‌ ఎస్‌ పార్టీ అభ్యర్థికి 59,764, బీజేపీ అభ్యర్థికి 47,041 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 11,323 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో రెండో ప్రధాన్యతా ఓట్ల లెక్కింపునకు ఆదేశించారు. వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టిఆర్‌ ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ముందంజలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్‌ తుది దశకు చేరింది. 15 వ రౌండ్‌ పూర్తి అయ్యే సరికి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి 12,337 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. రాజేశ్వర్‌ రెడ్డికి 58,370, రామ్మోహన్‌రావుకు 46, 033, కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న 12, 661, సూరం ప్రభాకర్‌ రెడ్డి 11,394 ఓట్లు వచ్చాయి. అయితే ఏ అభ్యర్థికి 50 శాతానికి మించి ఓట్లు రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యమైంది. ఈ కౌంటింగ్‌ లో ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో విజేతగా నిలవాలంటే  ఏ పార్టీకైనా 66,777 ఓట్లు రావాలి. కానీ టీఆర్‌ ఎస్‌ పార్టీ అభ్యర్థికి 59,764, బీజేపీ అభ్యర్థికి 47,041 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 11,323 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పక్రియ గురువారం పూర్తయింది. దాంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.