రెండో వికెట్‌ను కోల్పోయిన భారత్‌

బెంగళూరు: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది. గంభీర్‌ 34 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద బౌల్ట్‌ బౌలింగ్‌లో టైలర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు 12వ ఓవర్లలో సెహ్వాగ్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 261 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్‌ 20 ఓవర్ల ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది.