రెచ్చగొట్టే వస్త్రధారణ వద్దు

ఇండోర్‌: మహిళ వస్త్రధారణ, వ్యవహార శైలిపైనే వారి భద్రత ఆధారపడి ఉంటుందని మధ్య ప్రదేశ్‌ మంత్రి వ్యాఖ్యానించారు. మహిళల ఫ్యాషన్‌, జీవనశైలి నడవడిక భారత సంప్రదాయాలకు తగినట్లు ఉండాలి. ఇతరులను రెచ్చగొట్టేలా వారు దుస్తులు ధరించకూడదు. అని మధ్య ప్రదేశ్‌ పరిశ్రమల శాఖ మంత్రి కైలశ్‌ విజయ వర్గీయ శుక్రవారం పేర్కొన్నారు. గౌహతిలో యువతిపై వేదింపుల ఘటనపై ఆయన స్పందిస్తూ మహిళ వస్త్రధారణ గౌరవం పెంచేదిగా ఉండాలి. అయితే దురదృష్టవశాత్తు ఇతరులను రెచ్చగొట్టేలా వారి వస్త్రధారణ ఉంటోంది. ఇది సమాజంలో తప్పులకు దారి తీస్తోంది అని పేర్కొన్నారు. ఇదే ఆంశంపై మహిళా జాతీయ కమిషన్‌ చైర్‌పర్సన్‌ మమతాశర్మ కూడా ఇటీవల ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.