రేపు టీఆర్‌ఎస్ అడహక్ కమిటీ సభ్యులతో సీఎం భేటీ

హైదరాబాద్: రేపు సాయంత్రం నాలుగు గంటలకు అడహక్ కమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్‌లో అడహక్ కమిటీ సభ్యులతో సీఎం సమావేశమవుతారని కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. సభ్యత్వ నమోదుపై సమీక్ష జరుగుతుందన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు జోరుగా సాగుతోందని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు 40 లక్షలకు చేరుకుంటుందని తెలిపారు.