రేపు టీఎస్ లాసెట్..
వరంగల్‌లోనాలుగు పరీక్ష కేంద్రాలు..
వరంగల్‌లో మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ ప్రవేశ పరీక్షకు 1541 మంది, ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ ప్ర వేశ పరీక్షకు 504మంది, ఎల్‌ఎల్‌ఎంకు 319 మంది హాజ రు కానున్నట్లు రీజినల్ కో ఆర్డినేటర్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్.పద్మజారాణి తెలిపారు. వరంగల్‌లోని సుబేదారి ఆర్ట్స్‌కళాశాల, న్యాయ కళాశాల, యూనివర్శిటీ పీజీ కళాశాల, యూనివర్శిటీ మహిళా పీజీ కళాశాలలో నాలుగు సెంటర్ల లో పరీక్షలను నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. మూడు, ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ ప్రవేశ పరీక్షను ఉదయం 10 గంటలనుంచి 11.30 గంటల వరకు, ఎల్‌ఎల్‌ఎం ప్రవేశపరీక్షను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
14 రీజినల్ కేంద్రాలు..
రాష్ట్ర వ్యాప్తంగా 14 ప్రాంతీయ కేం ద్రాల పరిధిలో 37 పరీక్ష కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లను చేస్తున్నట్లు కన్వీనర్ తెలిపారు. పరీక్షలను పకడ్బందిగా నిర్వహించడానికి పరిశీలకులను నియమించినట్లు వెల్లడించారు. ఇతర ప్రవేశ పరీక్షల నిబంధనలు ఈ పరీక్షకు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యం నిబంధన, బయోమెట్రిక్ విధానం, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేక పోవ టం వంటి విషయాలను విద్యార్థులు గమనించాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ప్రొఫెసర్ ఎంవీ రంగారావు తెలిపారు.