రేపు ఢిల్లీ బాట పట్టనున్నా టీ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ టీ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు మంగళవారం ఢిల్లీ బాట పట్టనున్నారు. సీఎల్పీలో టీ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల భేటీ ముగిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మంత్రులు, ఎంపీలతో కలిసి అధిష్టాన పెద్దలను కలవాని నిశ్చయించినట్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అధిష్టానాన్ని కోరుతామని తేల్చిచెప్పారు. తెలంగాణ సాధించి తీరుతామని, ఈ విషయంతో ఎటువంటి ఆందోళన చెందవద్దని తెలంగాణవాదులను కోరారు.