రేపు వాన్‌పిక్‌ పై అభియోగపత్రం దాఖలు చేయనున్న సీబీఐ

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో భాగంగా వాన్‌పిక్‌ వ్యవహారంపై అభియోగంపత్రం దాఖలు చేయాడానికి సీబీఐ సిద్దమైంది. గుంటూరు,ప్రకాశం జిల్లాల్లో వాన్‌పిక్‌కు ప్రభుత్వం పెద్దఎత్తున భూములు కేటాయించింది. ఇందులో భాగంగా జగన్‌ సంస్థల్లో 450కోట్ల పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్ట్‌ చేసిన విషయం విదితమే అయన్ను అరెస్ట్‌చేసి 90రోజులు కావటంతో వాన్‌పిక్‌ వ్యవహారంపై అభియోగపత్రం దాఖలు చేయాడానికి సీబీఐ సిద్దమైంది.