రేప్‌బాధిత కుటుంబాలకు సోనియా పరామర్శ

హర్యానా : మానవ మృగాలు చేస్తున్న వరుస అత్యాచారాలకు హర్యానా స్త్రీలు వణికిపోతున్నారు. హర్యానాలో ఒకే నెలలో 13 రేప్‌ కేసులు నమోదయ్యాయి, జింద్‌ జిల్లా నర్వానాలో అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఓదళిత యువతి కుటుంబాన్ని ఇవాళ కాంగ్రెస్‌ అధినేత్రి, యూపీఏ సారథి సోనియా గాంధీ పరామర్శించారు. బాధితురాలి కుటుంబ  సభ్యులను ఓదార్చారు.