రేషన్ తరహాలో దర్శినానికి నేను వ్యతిరేకం: కనుమూరి
తిరుపతి: రేషన్ తరహాలో శ్రీవారి దర్శినానికి తాను వ్యతిరేకమని భక్తి, తృప్తిని బట్టి భగవంతుడిని ఎన్ని సార్లు అయినా దర్శించుకోవచ్చని టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. తిరుమలలో ఈ రోజు టీటీడీ పాలకమండలి సమావేశం ప్రారంభం అయింది. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో తాగునీటి సమస్యను నెలరోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు. కుమారధార, పసుపుధారనుంచి అటవీశాఖ అనుమతితో పైపులైను పనులు చేస్తున్నామన్నారు.