రైతుబంధు సంపూర్ణం

 

11వ విడతలో రూ.7624.74 కోట్లు రైతుల ఖాతాల్లోకి

68.99 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాలకు పంపిణీ

అత్యధికం నల్లగొండ జిల్లాలో 5 లక్షల 8756 మంది రైతులకు రూ.609.67 కోట్లు

అత్యల్పం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 35,879 మంది రైతులకు రూ.33.60 కోట్లు

తెలంగాణలో రైతును రాజును చేయాలన్న సంకల్పంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారు

ఎన్ని ఇబ్బందులున్న ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పూర్తిచేస్తున్నాం

రైతుబంధు మొదలుపెట్టినప్పుడు ఎన్నికల కోసం అని విమర్శించారు

11వ విడత రైతుబంధు విజయవంతంగా పూర్తిచేసుకున్నాం

మొత్తం ఇప్పటి వరకు రూ.72,815.09 కోట్లు నేరుగా రైతుల ఖాతాలలోకి

స్వంతంత్ర భారత చరిత్రలో ఇది ఒక రికార్డు

అన్నదాతల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలుస్తారు

అన్నం పెట్టే అన్నదాతకు ఆసరాగా నిలవాలన్నదే కేసీఆర్ గారి తపన

దేశంలో ఉచిత కరంటు, సాగునీళ్లు, రైతుబంధు, రైతుభీమా పథకాలతో పాటు వంద శాతం పంటలు కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

రాష్ట్ర రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి