రైతులకురుణమాఫీ చేసింది దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి.. టీఎస్ సంజు కుమార్

అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 2
అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్ పిజిఆర్ విగ్రహం దగ్గర ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ కాంటెస్ట్  కార్పొరేటర్ టిఎస్ సంజీవ్ కుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిదిఅని గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజల కోసం ఆయన చేసిన శ్రమ ప్రజల గుండెల్లో నాటుకు పయే విధంగా వైయస్సార్ చేశారని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వైద్యం 108 104 రైతులకు గిట్టుబాటు ధర జలయజ్ఞం మహిళలకు పావలా వడ్డీ రుణాలు వృద్ధాప్య పెన్షన్లు వివిధ సంక్షేమ పథకాలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయని వైయస్సార్ లేని లోటు రాష్ట్రానికి తీరని నష్టమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి, సిఎల్ యాదగిరి, శ్రీనివాసులు, ఓంకార్, మీనస్ మేరీ, పద్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.