రైతులకు విద్యుత్‌ ఏడు గంటల సరఫరా అందేలా చర్యలు: సీఎం

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ పరిస్థితి మరో వారం రోజుల్లో మెరుగుపడుతుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి చెప్పారు. సచివాలయంలో ఇంధనశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి అదనపు విద్యుత్‌ కొనుగోలుకు, రీలిక్విషైడ్‌ సహజవాయువు దిగుమతి చేసుకునేందుకు వారం రోజుల్లో 600 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రైతులకు నిరంతరాయంగా ఏడు గంటల సరఫరా అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. ఎన్టీపీసీకి బొగ్గు సరఫరాని మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకునేలా కోల్‌ ఇండియా లిమిటెడ్‌కు సీఎం లేఖ రాసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.