రైతుల గోడు పట్టని ప్రభుత్వం :విజయమ్మ
హైదరాబాద్ : ఎవరూ అడగకుండానే 2009లో ఏలేరు ఆధునీకరణ పనులకు వైఎస్సార్ శంకుస్థాపన చేశారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. ముఖ్యమంత్రిగా ఎప్పూడు రైతుల గురించే ఆయన ఆలోచించేవారని ,ఆయన ఉన్నన్నాళ్లు రైతులకు భరోసా ఉండేదని ,ప్రస్తుత ప్రభుత్వానికి రైతుల గోడు పట్టడంలేదని విమర్శించారు. జగన్ నాయకత్వంలో ఏలేరు ఆధునీకరణ తప్పకుండా జరుగుతుందని తనను కలిసిన తూర్పుగోదావరి జిల్లా రైతులకు ఆమెహామినిచ్చారు.


