రైతు అత్మహత్య

 

కోటపల్లి మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన పోత్తూరు రాజేష్‌ (23) అనే పత్తి రైతు బుధవారం రాత్రి అత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులమందు తాగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజేష్‌ తన ఫోలంతో పాటు 4 ఎకరాలు అదనంగా కౌలుకు తీసుకుని పత్తి పండిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగి వంట నాశనమవడంతో అప్పులపాలయ్యారు. దీంతో మనస్తాపానికిగురై అత్మహత్యకు పాల్పడ్డారు.