రైతు ఆత్మహత్య

తొగుట: కడుపు నొప్పి భరించలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తొగుట మండలం కాన్గల్‌లో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పోతరాజు భూమయ్య తరచూ కడుపునొప్పితో బాధపడు తున్నాడు. ఆసుపత్రులు తిరిగినా కడుపునొప్పి తగ్గలేదు. సోమవారం రాత్రి తీవ్ర కడుపునొప్పి రావడంతో తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకొని మృతిచెందాడు. భూమయ్యకు భార్య కనకవ్వ, కుమారుడు నరేష్‌, కుమార్తె ఎప్సీభాలున్నారు. కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జార్జ్‌ వెల్లడించారు.