రైతు ధర్నా పేరిట రాజకీయం: సీఎల్పీ

హైదరాబాద్‌: తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు రైతు ధర్నా పేరిట రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్‌ శాసనసభాపక్షం ఆరోపించింది. కౌలు రైతులు ఇబంబదుల్లో ఉన్నారని, వారిని ప్రభుత్వం ఆరుకోవలసిన అవసరం ఉందని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కిరణ్‌ సర్కారు రైతుల కోసం కృషి చేస్తుంటే తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి వ్యకసాయాన్ని పట్టించుకోని బాబు ఇప్పుడు ధర్నా చేయటం విడ్డూరంగా ఉందని సీఎల్పీ ఆక్షిపించింది.