రైలు ప్రమాదంలో 47 మంది మృతి
నెల్లూరు: నెలూర్లులో జరిగిన తమిళనాడు ఎక్స్ప్రెస్ అగ్నిప్రమాద దుర్ఘటనలో 47 మంది మృతిచెందినట్లు రైల్వే అధికారులు ధ్రువీకరించారు. మరో 28 మందికి గాయాలైనట్లు తెలియజేశారు. ప్రమాదం జరిగిన బోగీలో మొత్తం 72 మంది ప్రయాణికులు ఉన్నారని రైల్వే డీఆర్ఎం చెప్పారు. విజయవాడ నుంచి 28 మంది, ఢిల్లీ నుంచి 17,వరంగల్ నుంచి 7, భోపాల్ నుంచి ముగ్గురు, నాగపూర్ నుంచి ఒకరు, ఝాన్సీ నుంచి ఆరుగురు ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నరని వివరించారు. నెల్లూరులోని బొలినేని ఆసుపత్రిలో ఐదుగురు, జయభారత్ ఆస్పపత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.