రైల్వేసబ్ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం
నెల్లూరు: కావలి బుడంగుంట వద్ద రైల్వే సబ్‌స్టేషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే తాము వచ్చేంత వరకూ మంటలు ఆర్పవద్దని అగ్నిమాపక సిబ్బందిని రైల్వే అధికారులు ఆదేశించారు. దీంతో కెపాసిటర్ బ్యాంక్ మంటల్లో కాలిపోయింది.